వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తాం: కేటీఆర్ వ్యాఖ్యలకు అక్బరుద్దీన్ కౌంటర్

  • అసెంబ్లీలో ఎంఐఎం, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం
  • అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు... కేటీఆర్ ప్రతివ్యాఖ్యలు
  • ఉన్నదే ఏడుగురు ఎమ్మెల్యేలంటూ కేటీఆర్ విమర్శలు
  • ఈసారి 15 మంది ఎమ్మెల్యేలతో వస్తామన్న అక్బరుద్దీన్
Akbaruddin Owaisi counters KTR remarks

ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరగడం తెలిసిందే. అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలకు, మంత్రి కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నదే ఏడుగురని, వారికి అధిక సమయం కేటాయించరని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై అక్బరుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. 

ఏడుగురు ఎమ్మెల్యేలే ఉన్నారని కేటీఆర్ అన్నారని, దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. తమ పార్టీ అధినేత అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. దీనిపై తాను పార్టీ చీఫ్ తో మాట్లాడతానని వెల్లడించారు. ఏడుగురు కాదు కనీసం 15 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యేలా చూస్తామని అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ఈసారి మరింతమంది ఎమ్మెల్యేలతో సభలో అడుగుపెడతామని చెప్పారు.

More Telugu News