గాయని వాణీ జయరాం మరణంపై అనుమానాలు.. రంగంలోకి పోలీసులు

  • వాణీ జయరాం ముఖం, నుదుటిపై గాయాలున్నట్లు చెప్పిన పనిమనిషి
  • గాయని ఇంటిని అధీనంలోకి తీసుకున్న పోలీసులు
  • ఇంటి సీసీటీవీ ఫుటేజీ పరిశీలన 
Doubts on singer Vani Jayarams death

ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణీ జయరాం ఈరోజు ఉదయం చెన్నైలో మరణించారు. అయితే ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాణీ జయరాం ముఖంపై గాయాలున్నట్లు పనిమనిషి చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గాయని ఇంటిని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈమేరకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

ఉదయం ఎంతసేపు కాలింగ్ బెల్ కొట్టినా వాణీ జయరాం తలుపు తీయలేదని పోలీసులకు పనిమనిషి తెలిపారు. దీంతో తలుపుబద్దలు కొట్టి లోపలికి వెళ్లినట్లు చెప్పారు. నుదురు, ముఖంపై ఎవరో కొట్టినట్లుగా తీవ్ర గాయాలు ఉన్నాయని, అప్పటికి ఆమె స్పృహలో లేరని వివరించారు.

దీంతో పనిమనిషి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలు తనిఖీ చేశారు. తర్వాత వాణీ జయరాం పార్థివ దేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News