బుల్డోజర్ పై వెళ్లి.. పెళ్లిచేసుకున్న యువకుడు!

  • గుజరాత్ లోని నవ్ సారి లో జేసీబీపై వెళ్లిన పెళ్లికొడుకు
  • డ్రమ్స్, డీజేలతో పెళ్లికూతురు ఇంటికి
  • పంజాబ్ లో ఓ పెళ్లి వీడియో చూసి తాను అలానే చేసిన కేయుర్ పటేల్
Groom arrives for wedding on JCB in Gujarats Navsari

పెళ్లంటే నూరేళ్ల పంట.. సింపుల్ గా వివాహం చేసుకునే వాళ్లు కొందరైతే.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఘనంగా చేసుకోవాలనుకునే వాళ్లు మరికొందరు.. కాస్త వెరైటీగా చేసుకునే వాళ్లు కూడా ఉంటారు.

పెళ్లికి హెలికాప్టర్ లో, గుర్రాలపై, బస్సు నడుపుకుంటూ వచ్చిన పెళ్లి కూతుళ్లు, పెళ్లి కొడుకుల వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా గుజరాత్ లో ఓ పెళ్లికొడుకు బుల్డోజర్ పై పెళ్లికి వెళ్లాడు. 

నవ్ సారి లోని చిక్లికి చెందిన కేయుర్ పటేల్.. గతంలో సోషల్ మీడియాలో ఓ వీడియోను చూశాడు. పంజాబ్ కు చెందిన ఓ వ్యక్తి తన పెళ్లికి బుల్డోజర్ లో వెళ్లడం గమనించాడు. ఇది కేయుర్ కు బాగా నచ్చింది. తాను కూడా తన పెళ్లికి బుల్డోజర్ పై వెళ్లాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు అదే చేశాడు. 

పూలతో అలంకరించిన బుల్డోజర్ పై కూర్చుని కేయుర్ తన పెళ్లికి వచ్చాడు. డ్రమ్స్, డీజేలతో పెళ్లికూతురు ఇంటికి చేరుకున్నాడు. తర్వాత జేసీబీలోనే పెళ్లికూతురిని ఇంటికి తీసుకెళ్లాడు. ఇప్పుడు ఇది టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. చూసే వాళ్లకి కాస్త షాకింగ్ గా అనిపించినా.. తన డ్రీమ్ నెరవేరిందని కేయుర్ సంతోషంగా ఉన్నాడు.

More Telugu News