జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఇప్పుడు ఉపయోగం లేదు: లక్ష్మీపార్వతి

  • జగన్ లా జనంలో ఉంటే ఐదేళ్ల తర్వాత అవకాశం ఉండొచ్చన్న లక్ష్మీపార్వతి
  • ప్రజలతో మమేకం కావాలని సూచన
  • ఇప్పటికే ఆలస్యం అయిందని వ్యాఖ్య
Lakshmi parvathi about junior NTR

వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఉపయోగం లేదని చెప్పారు. ఇప్పటికే ఆలస్యమయిందని... జగన్ లా జనంలోనే ఉంటే ఐదేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు అవకాశం ఉంటుందని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు పూర్తి పగ్గాలు ఇచ్చి, ఐదేళ్ల పాటు జగన్ లా ప్రజలతో మమేకమైతే అవకాశం ఉండొచ్చని చెప్పారు. మళ్లీ జగనే ముఖ్యమంత్రి అని తెలిపారు. లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

More Telugu News