Dog: బాల్ బ్యాలెన్సింగ్ గేమ్ లో ఈ డాగ్ తో పోటీపడడం కష్టమే!

Dog sits on top of moving car in Bengaluru Viral video divides Twitter
  • యజమాని విసిరిన బంతిని కింద పడనీయని కుక్క
  • తలతో బ్యాలెన్స్ చేస్తూ ఆట
  • కారు పైన కూర్చుని నగర విహారం చేసిన శునకం
పెంపుడు శునకాలకు నేర్పాలే కానీ, చాలా పనులు చేసి పెడతాయి. మనుషులకు చాలా సన్నిహితంగా ఉంటూ, మనల్ని అనుకరించే శునకాలకు సంబంధించి ఎన్నో నైపుణ్యాలను చూసి ఉంటారు. అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటి. ఈ కుక్క తన యజమాని గాల్లోకి విసిరిన బాల్ కింద పడకుండా తన తలతో బ్యాలెన్స్ చేస్తూ ఆడిన ఆట చూసిన వారితో ఔరా అనేలా చేస్తుంది. చాలా చక్కగా బ్యాలన్స్ చేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

అలాగే, బెంగళూరులో జరిగిన మరో ఘటన గురించి కూడా చెప్పుకోవాలి. యజమానులతో కలసి శునకాలు కార్లలో, టూవీలర్లలో బయట విహారానికి వెళుతుండడం చూస్తుంటాం. కానీ బెంగళూరులో ఓ శునకం తన యజమాని కారు లోపల కాకుండా, కారుపైకి ఎక్కి కూర్చుని నగర విహారం చేసింది. ఏ మాత్రం తొణకకుండా, బెదరకుండా అది కూర్చోగా, దారినపోయే వారు అది చూసి వీడియో తీశారు.
Dog
ball skills
sports

More Telugu News