లోకేశ్ 9వ రోజు పాదయాత్ర షెడ్యూల్

  • పూతలపట్టు నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్ర
  • వజ్రాలపల్లి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం
  • 100 కిలోమీటర్లు దాటిన పాదయాత్ర
Lokesh padayatra 9th day schedule

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర 9వ రోజుకు చేరుకుంది. ఈ ఉదయం పూతలపట్టు నియోజకవర్గం వజ్రాలపల్లి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమయింది. క్యాంప్ సైట్ వద్ద పాదయాత్ర ప్రారంభమయ్యే ముందు సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమం కొనసాగింది. కొండ్రాజుకాల్వ వద్ద మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది. రాత్రికి తవణంపల్లి విడిది కేంద్రంలో లోకేశ్ బస చేస్తారు. ఇప్పటి వరకు లోకేశ్ పాదయాత్ర 100.8 కిలోమీటర్లు కొనసాగింది. నిన్న 12.3 కిలోమీటర్లు నడిచారు.   

9వ రోజు పాదయాత్ర షెడ్యూల్:

ఉదయం 8.00 గంటలకు వజ్రాలపల్లి విడిది కేంద్రంలో బీసీ ప్రముఖులతో ముఖాముఖి. అనంతరం పాదయాత్ర ప్రారంభం
10.15 గంటలకు వంకమిట్టలో మామిడి రైతులతో సమావేశం
11.10 గంటలకు సదకుప్పంలో ఎస్సీ మాల సామాజికవర్గీయులతో భేటీ  
12.05 గంలకు గొల్లపల్లిలో వడ్డెర సామాజికవర్గీయులతో ముఖాముఖి
1.45 గంటలకు కొండ్రాజుకాల్వ వద్ద భోజన విరామం 
సాయంత్రం 3.00 గంటలకు కొండ్రాజుకాల్వలో మహిళలతో సమావేశం
4.50 గంటలకు ఎగువ తడకర గ్రామస్తులతో మాటామంతీ
7.15 గంటలకు తవనంపల్లి విడిది కేంద్రంలో బస.

More Telugu News