Nara Lokesh: 100 కిమీ పూర్తిచేసుకున్న పాదయాత్ర... బంగారుపాళ్యంలో శిలాఫలకం ఆవిష్కరించిన లోకేశ్

Lokesh Yuvagalam padayatra completes 100 km
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనవరి 27 నుంచి నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర నేటితో 100 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ఈ ఘట్టానికి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వేదికగా నిలిచింది. 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ఘట్టంలో ఇది తొలి మైలురాయి కావడంతో, లోకేశ్ బంగారుపాళ్యంలో శిలాఫలకం ఆవిష్కరించారు. కాగా, యువగళం పాదయాత్ర బంగారుపాళ్యంలో ప్రవేశించిన సందర్భంగా పోలీసులు... లోకేశ్ కాన్వాయ్ లోని 3 వాహనాలను సీజ్ చేశారు. లోకేశ్ బంగారుపాళ్యంలో ప్రవేశించిన సందర్భంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
Go Back to Shorts
Nara Lokesh
Yuva Galam Padayatra
100 KM
Bangarupalem
Chittoor District
TDP

More Telugu News