'అమిగోస్' ప్రీ రిలీజ్ ఈవెంటుకి చీఫ్ గెస్టుగా ఎన్టీఆర్!

  • కల్యాణ్ రామ్ తాజాగా చిత్రంగా 'అమిగోస్'
  • నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీస్
  • కర్నూల్ లో ట్రైలర్ రిలీజ్ చేసిన కల్యాణ్ రామ్  
  • కథానాయికగా ఆషిక రంగనాథ్ 
  • ఈ నెల 10వ తేదీన విడుదలవుతున్న సినిమా  
Amigos movie update

కల్యాణ్ రామ్ హీరోగా 'అమిగోస్' సినిమా రూపొందింది. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటూ ఉంటారు. వాళ్లలో ఒక ముగ్గురు కలుసుకుంటే ఎలా ఉంటుంది? అనే కథాకథనాలతో ఈ సినిమాను మైత్రీవారు నిర్మించారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ 'కర్నూల్'లో జరిగింది. ఈ వేదికపై కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. "కొత్తదనంతో నేను ఇంతవరకూ చేసిన సినిమాలను మీరంతా ఆదరిస్తూనే వచ్చారు. అలాగే 'అమిగోస్' సినిమాను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది" అన్నారు. 

"ఈ సినిమా విషయంలో నేను ఒక మాటను బలంగా చెప్పగలను. థియేటర్ కి వచ్చినవారెవరూ నిరాశతో తిరిగెళ్లరు. మీరంతా నాపై ఉంచిన నమ్మకాన్ని ఈ సారి కూడా నిలబెట్టుకుంటాను. ఎల్లుండి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. చీఫ్ గెస్టుగా ఎన్టీఆర్ వస్తున్నాడు. ఆ రోజున మిగతా విషయాలు మాట్లాడుకుందాము" అని చెప్పుకొచ్చారు.

More Telugu News