మనిషిని పోలిన మనుషులు ఎదురుపడితే అరిష్టం: 'అమిగోస్' ట్రైలర్ రిలీజ్

  • డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన 'అమిగోస్'
  • విభిన్నమైన పాత్రలలో కనిపించనున్న కల్యాణ్ రామ్ 
  • ఆషిక రంగనాథ్ కి తెలుగులో ఇది ఫస్టు మూవీ
  • ఈ నెల 10వ తేదీన విడుదలవుతున్న సినిమా  
Amigos movie trailer released

కల్యాణ్ రామ్ హీరోగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో 'అమిగోస్' సినిమా రూపొందింది. మైత్రీ మూవీస్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. అందుకు సంబంధించి వదిలిన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. 

గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఈ నెల 10వ తేదీన విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేశారు. అందులో భాగంగానే కొంతసేపటి క్రితం కర్నూల్ లోని శ్రీరామ థియేటర్లో ట్రైలర్ లాంచ్ ఈవెంటును నిర్వహించారు.

'మనిషిని పోలిన మనుషులు ఎదురుపడితే అరిష్టం' .. 'మనం ఫ్రెండ్స్ కాదు .. బ్రదర్స్ అంతకన్నా కాదు' .. 'రాక్షసుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు కదరా' అనే డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. తనని పోలిన మనుషుల వలన హీరో చిక్కుల్లో పడతాడనే విషయం ఈ ట్రైలర్ వలన అర్థమవుతోంది. ఈ సినిమాతో ఆషిక రంగనాథ్ కథానాయికగా పరిచయమవుతోంది. క్రితం ఏడాది 'బింబిసార' సినిమాతో హిట్ కొట్టిన కల్యాణ్ రామ్, ఈ సినిమాతో ఆ విజయాన్ని కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.

More Telugu News