కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ తో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ భేటీ

  • త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో కీలక పరిణామం
  • సుదీప్ ఇంటికి వెళ్లి కలిసిన డీకే శివకుమార్
  • కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉండాలని సుదీప్ ను ఆహ్వానించినట్లు సమాచారం
Actor Kichha Sudeeps Pic With Top Congress Leader Fuels Politics Talk

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ తో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ భేటీ అయ్యారు. ఇప్పుడు ఈ వార్త కన్నడ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 

బెంగళూరులోని సుదీప్ ఇంటికి శివకుమార్ వెళ్లి.. భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరి సమావేశానికి సంబంధించిన వివరాలు ఇంకా బయటికి రాలేదు. కేవలం మర్యాదపూర్వంగానే సుదీప్ ను శివకుమార్ కలిశారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉండాలని సుదీప్ ను ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.

గతంలో జేడీఎస్ తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. బీజేపీ దెబ్బకు 2019లో కూటమి కుప్పకూలింది. తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలతో బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ప్రభుత్వాన్నిఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.

కన్నడ సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటుల్లో సుదీప్ ఒకరు. 1997 నుంచి సినిమాల్లో నటిస్తున్నారు.

More Telugu News