అసెంబ్లీలో కేటీఆర్, ఈటల మధ్య ఆసక్తికర సన్నివేశం

  • అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సన్నివేశం
  • హుజూరాబాద్ కార్యక్రమానికి ఎందుకు రాలేదన్న కేటీఆర్
  • పిలిస్తే కదా వచ్చేది అన్న ఈటల
Interesting scene between KTR and Etela Rajender

ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ ల వద్దకు మంత్రి కేటీఆర్ వచ్చారు. పలు అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది. హుజూరాబాద్ లో జరిగిన అధికారిక కార్యక్రమానికి ఎందుకు రాలేదని ఈటలను కేటీఆర్ ప్రశ్నించారు. పిలిస్తే కదా హాజరయ్యేది అంటూ ఈటల సమాధానమిచ్చారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రాక్టీస్ సరిగా లేదని చెప్పారు. 

మరోవైపు సభకు రాజాసింగ్ కాషాయం రంగు చొక్కా వేసుకొచ్చారు. చొక్కారంగు కళ్లకు గుచ్చుకుంటోందని, ఈ రంగు తనకు ఇష్టం ఉండదని కేటీఆర్ అన్నారు. భవిష్యత్తులో మీరు కూడా కాషాయం రంగు వేసుకోవచ్చేమో అంటూ రాజాసింగ్ సరదా వ్యాఖ్యలు చేశారు. ఈలోగా గవర్నర్ వస్తున్నారంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కేటీఆర్ కు చెప్పారు. దీంతో ఆయన తమ స్థానాల వైపు వెళ్లిపోయారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు కూడా అంతకు ముందు ఈటల వద్దకు వచ్చి ప్రత్యేకంగా మాట్లాడారు.

More Telugu News