షర్మిలతో ఏం మాట్లాడాననేది త్వరలోనే తెలుస్తుంది: పొంగులేటి

  • షర్మిలతో భేటీ అయిన పొంగులేటి
  • వైఎస్సార్టీపీలో చేరుతానని మాట ఇచ్చారన్న షర్మిల
  • ఏ పార్టీలో చేరుతాననే విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుందన్న పొంగులేటి
Ponguleti response on party change

పార్టీ జెండా ఏదైనా తన అజెండా మాత్రం ఒకటేనని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో తన వెంట వచ్చిన వారిని గెలిపించుకోవడమే తన అజెండా అని చెప్పారు. వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కలిసినప్పుడు ఏం మాట్లాడాననేది త్వరలోనే తెలుస్తుందని అన్నారు. తాను ఏ పార్టీలో చేరాననే విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుందని చెప్పారు. 

బీఆర్ఎస్ పార్టీపై పొంగులేటి తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. పార్ఠీ అధిష్ఠానంపై ఆయన నేరుగానే విమర్శలు సంధించారు. పార్టీలో తనకు చాలా అవమానం జరిగిందని చెప్పారు. ఆయన బీజేపీలో చేరవచ్చనే ప్రచారం జరిగింది. తాజాగా షర్మిలతో ఆయన భేటీ అయ్యారు. ఇంకోవైపు వైఎస్సార్టీపీలో చేరుతానని పొంగులేటి తనకు మాట ఇచ్చారని షర్మిల చెప్పడంతో ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయంలో కొంత క్లారిటీ వచ్చినట్టయింది.

More Telugu News