Tarakaratna: బెంగళూరు నారాయణ హృదయాలయ వద్ద టీడీపీ నేతల పూజలు

TDP leaders offers special prayers at Narayana Hrudayalaya for Tarakaratna health
  • కుప్పంలో తీవ్ర గుండెపోటుకు గురైన తారకరత్న
  • నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స
  • త్వరగా కోలుకోవాలంటూ వినాయక ఆలయంలో పూజలు
  • 101 కొబ్బరికాయలు కొట్టిన హిందూపురం టీడీపీ నేతలు
ఇటీవల యువగళం పాదయాత్ర సందర్భంగా గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నకు బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ టీడీపీ నేతలు నారాయణ హృదయాలయ ఆసుపత్రి వద్ద వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

తారకరత్న ఆరోగ్యవంతుడై తిరిగి రావాలంటూ హిందూపురం టీడీపీ నేతలు 101 కొబ్బరికాయలు కొట్టారు. హిందూపురం టీడీపీ పార్లమెంటు స్థానం ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, తదితర నేతలు ఈ పూజల్లో పాల్గొన్నారు.
Tarakaratna
Health
TDP
Prayers
Narayana Hrudayalaya
Bengaluru

More Telugu News