బీపీ తగ్గించడానికి ఇంటి చిట్కాలు

  • గుండె నుంచి రక్తాన్ని పంప్ చేసినప్పుడు ధమనులపై పడే ఒత్తిడి రక్తపోటు
  • ఇది పెరగడానికి ఎన్నో రకాల కారణాలు ఉండొచ్చు
  • తేనె, యాపిల్ సైడర్ వెనిగర్ తో మంచి ఫలితం
High Blood Pressure Management 7 Effective Ayurvedic Remedies to Treat Hypertension at Home

నేటి జీవన శైలి కారణంగా చాలా మంది బీపీ (రక్తపోటు) సమస్యను తెచ్చిపెట్టుకుంటున్నారు. రక్తపోటు అదుపు తప్పితే అది గుండె పనితీరును దెబ్బతీసి, అంతిమంగా హార్ట్ ఎటాక్, మూత్రపిండాల వైఫల్యం రిస్క్ ను తెచ్చి పెడుతుంది. గుండె రక్తాన్ని పంప్ చేసే సమయంలో ధమనులపై (ఆర్టరీలు) పడే ఒత్తిడిని రక్తపోటుగా చెబుతారు.  

గుండె అధికంగా రక్తాన్ని పంప్ చేస్తుంటే, ధమనుల ప్రవాహ మార్గం సన్నబడినప్పుడు బీపీ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరిగి అది రక్త ప్రవాహ మార్గాల్లో చేరినప్పుడు రక్తపోటు పెరుగుతుంది. అలాగే, అధిక ఒత్తిడితోనూ ఈ సమస్య ఏర్పడుతుంది. గుండె అధికంగా స్పందించినప్పుడు రక్తపోటు అధికమవుతుంది. రక్తపోటు అధికంగా ఉన్న అందరిలోనూ లక్షణాలు కనిపించాలనేమీ లేదు. కొందరిలో తలనొప్పి, ముక్కుల వెంట రక్తం కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కనిపించొచ్చు. రక్తపోటు ఎక్కువగా ఉంటే దాన్ని తగ్గించుకునేందుకు ఇంట్లోనే కొన్ని విధానాలను పాటించొచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

  • తేనె కలిపిన నీరు తాగొచ్చు. కప్పు వేడి నీటిలో ఒక స్పూన్ తేనె, 5 లేదా 10 చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకుని, ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఉదయం తీసుకోవాలి. ఇది రక్తనాళాల వ్యాకోచానికి తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీంతో రక్తపోటు కూడా దిగొస్తుంది.
  • రక్తపోటు ఉన్నవారు ఉప్పు పరిమాణాన్ని తగ్గించుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది. అలాగే, ఫ్రై చేసిన ఆహారాలు, మసాలా ఫుడ్స్ కు కూడా దూరంగా ఉండాలి. 
  • పెసరపప్పుతో చేసిన సూప్ తాగొచ్చు. అందులో కొంత పసుపు, ధనియాల పొడి, జీలకర్ర వేసుకుంటే ఇంకా మంచిది.
  • ఆరెంజ్ జ్యూస్ ని, కొబ్బరి నీటితో కలిపి తీసుకోవాలి. ఇందులో ఒక వంతు కొబ్బరి నీరు అయితే, మిగిలినది ఆరెంజ్ జ్యూస్ ఉండాలి. రోజులో రెండు మూడు సార్లు తాగొచ్చు.

More Telugu News