తెలంగాణ విద్యుత్ శాఖలో 1600ల పోస్టుల భర్తీ

  • భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్ఎస్పీడీసీఎల్
  • జూనియర్ లైన్ మెన్ పోస్టుల ఖాళీలే ఎక్కువ
  • ఈ నెల 15న పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల
TSSPDCL Jobs Notification for Recruitment of Total 1601 AE and Junior Lineman Vacancies

తెలంగాణలోని నిరుద్యోగులకు టీఎస్ఎస్పీడీసీఎల్ శుభవార్త చెప్పింది. భారీగా కొలువుల భర్తీకి తాజాగా మరో ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,601 పోస్టుల భర్తీకి ప్రాసెస్ మొదలు పెట్టింది. ఇందులో 1,553 జూనియర్ లైన్ మెన్ (జేఎల్ఎం) పోస్టులు కాగా, మిగతా 48 అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టులు ఉన్నాయి. నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలతో ఈ నెల 15న పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు టీఎస్ఎస్పీడీసీఎల్ వెల్లడించింది.

జేఎల్ఎం పోస్టులకు పదో తరగతితో పాటు ఐటీఐ, ఇంటర్ ఒకేషనల్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఈ పోస్టులకు రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీంతోపాటు పోల్ క్లైంబింగ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎంపికైన అభ్యర్థుల వేతన శ్రేణి రూ.24,340 నుంచి రూ.39,405 గా ఉంటుంది.

అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి విషయానికి వస్తే.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టుల వేతన శ్రేణి రూ. రూ.64,295 - రూ.99,345గా ఉంటుందని అధికారులు వెల్లడించారు.

More Telugu News