కేన్సర్ సోకిన చిన్నారుల కోసం టర్కీ ఆసుపత్రి కొత్త ప్రయత్నం

  • కేసెరి పట్టణంలోని ఎర్సియెస్ ఆసుపత్రిలో టాయ్ కార్ల వినియోగం
  • పిల్లలను స్ట్రెచర్ పై తీసుకెళ్లకుండా కార్లలో తీసుకెళుతున్న సిబ్బంది
  • సంతోషంగా సహకరిస్తున్న చిన్నారులు
Turkish hospital uses toy cars to take kids with cancer for treatment watch vedio

కేన్సర్ మహమ్మారి ఎంత శక్తిమంతమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేన్సర్ సోకితే, దాని నుంచి బయటకు వచ్చేందుకు ఎంతో కఠినమైన రేడియేషన్, కీమోథెరపీ చికిత్సలు తీసుకోవాలి. వీటి కారణంగా ఎన్నో దుష్ప్రభావాలు వస్తుంటాయి. వాటిని తట్టుకోవడం పెద్దవాళ్లకే కష్టంగా ఉంటుంది. మరి కేన్సర్ సోకిన చిన్నారుల పరిస్థితి ఏంటి? 

అందుకే టర్కీలోని కేసెరి పట్టణంలో ఎర్సియెస్ ఆసుపత్రి కొత్తగా ఆలోచించింది. కేన్సర్ చిన్నారులను చికిత్స కోసం తీసుకెళ్లేందుకు ఎలక్ట్రిక్ టాయ్ కార్లను ఉపయోగిస్తోంది. హాస్పిటల్ కు వచ్చిన చిన్న పిల్లలను కారులో కూర్చోబెట్టి రిమోట్ తో ఆపరేట్ చేస్తూ వారిని ట్రీట్ మెంట్ రూమ్ కు తీసుకెళుతోంది. ఆ సమయంలో చిన్నారులు సంతోషంగా కనిపించడం ఎవరినైనా కదిలించకమానదు. ట్రీట్ మెంట్ లో భాగంగా చిన్నారులను ఆసుపత్రిలో ఒక చోట నుంచి మరో చోటకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందుకోసం స్ట్రెచర్ కు బదులు ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగిస్తున్నట్టు అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. దీనివల్ల చిన్నారుల్లో సంతోషం కనిపిస్తున్నట్టు చెప్పారు.

More Telugu News