తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. గవర్నర్ తమిళిసైకి స్వాగతం పలికిన కేసీఆర్

  • కాళోజీ మాటలను ప్రస్తావిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్
  • తన ప్రభుత్వం అపూర్వమైన విజయాలను సాధించిందన్న తమిళిసై
  • రాష్ట్ర వృద్ధిలో సీఎం, మంత్రుల కృషి ఎంతో ఉందని వ్యాఖ్య
KCR welcomes Guv Tamilisai to Assembly

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళసైకి ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవపూర్వకంగా నమస్కరించి ఆహ్వానం పలికారు. ప్రస్తుతం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నారు. ప్రజాకవి కాళోజీ మాటలను ప్రస్తావిస్తూ ఆమె ప్రసంగం ప్రారంభమయింది. 

తన ప్రభుత్వం అపూర్వమైన విజయాలను సాధించిందని ఆమె అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని తెలిపారు. దేశ ధాన్యాగారంగా తెలంగాణ అవతరిస్తోందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో సీఎం, మంత్రుల కృషి ఎంతో ఉందని అన్నారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంలా మారిందని అన్నారు. సంక్షోభం, అభివృద్ధిలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో 24 గంటలూ విద్యుత్ సరఫరా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆమె ప్రసంగం కొనసాగుతోంది.

More Telugu News