కె. విశ్వనాథ్ మృతిపై బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతి

  • విశ్వనాథ్ తెలుగుజాతి ముద్దుబిడ్డ అన్న బాలయ్య
  • ఇండస్ట్రీ పెద్ద దిక్కును కోల్పోయిందని ఆవేదన
  • ఎన్నో అపురూప చిత్రాలను అందించారన్న జూనియర్ ఎన్టీఆర్
Balakrishna and Junior NTR pays condolences to K Vishwanath

కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతిపై సినీ నటులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విశ్వనాథ్ తెలుగుజాతి ముద్దుబిడ్డ అని బాలకృష్ణ అన్నారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని చెప్పారు. మన సంస్కృతి, సంగీత, సాహిత్యాల ఔన్నత్యాన్ని దశదిశలా చాటారని కొనియాడారు. విశ్వనాథ్ సినిమాలు సందేశాత్మకంగా ఉండటమే కాకుండా, కుటుంబ వ్యవస్థ గొప్పదనాన్ని చాటాయని చెప్పారు. సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 


జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ... 'తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాథ్ గారిది ఉన్నతమైన స్థానం. శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అపురూపమైన చిత్రాలని అందించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశారు.

More Telugu News