నారా లోకేశ్ 8వ రోజు పాదయాత్ర... ఈనాటి షెడ్యూల్ ఇదిగో!

 • ఇప్పటి వరకు 88.5 కిలోమీటర్ల మేర కొనసాగిన పాదయాత్ర
 • ఈ ఉదయం మొగిలి దేవాలయం సమీపంలోని విడిది కేంద్రం నుంచి యాత్ర ప్రారంభం
 • బలిజపల్లి గ్రామస్తులతో లోకేశ్ భేటీ
Nara Lokesh 8th day padayatra started

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ ఉదయం మొగిలి దేవాలయం సమీపంలోని విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమయింది. కాసేపటి క్రితం బలిజపల్లి గ్రామస్తులతో ఆయన భేటీ అయ్యారు. రాత్రికి ఆయన వజ్రాలపురం విడిది కేంద్రంలో బస చేస్తారు. ఇప్పటి 88.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. నిన్న లోకేశ్ 16.2 కిలోమీటర్లు నడిచారు.  


 8వ రోజు పాదయాత్ర షెడ్యూల్:
 
 • ఉదయం 9.00 గంటలకు మొగిలి దేవాలయం సమీపంలోని విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం
 • 10.15 గంటలకు బలిజపల్లి గ్రామస్తులతో భేటీ
 • 11.40 గంటలకు శేషాపురంలో మహిళలతో ముఖాముఖి  
 • 12.50 గంటలకు వెంకటగిరిలో భోజన విరామం 
 • సాయంత్రం 3.50 గంటలకు వెంకటగిరి నుంచి పాదయాత్ర ప్రారంభం
 • 4.35 గంటలకు వెంకటగిరి జామియా మసీదులో ప్రార్థనలు
 • 5.00 గంటలకు బంగారుపల్లి జంక్షన్ లో బహిరంగసభ
 • 7.45 గంటకు వజ్రాలపురం విడిది కేంద్రంలో బస.

More Telugu News