నాకు ఎవరంటే భయమంటే..!: 'ఆహా.. అన్ స్టాపబుల్ 2' వేదికపై పవన్ వివరణ

  • 'అన్ స్టాపబుల్ 2' వేదికపై బాలయ్య అల్లరి .. పవన్ సందడి 
  • తనకి యాక్టింగ్ ఇష్టం ఉండేది కాదన్న పవన్ 
  • త్రివిక్రమ్ ని గురువు స్థానంలో ఉంచుతానని వ్యాఖ్య 
  • తల్లి అంటే తనకి చాలా ఇష్టమని వివరణ
Unstoppable 2 Update

'ఆహా' ఓటీటీలో బాలయ్య వ్యాఖ్యాతగా 'అన్ స్టాపబుల్ 2' టాక్ షో సూపర్ హిట్ గా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్న ఎపిసోడ్ గురించి అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పవన్ పాల్గొన్న ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా అందించనున్నారు. ఫస్టు పార్టును నిన్న రాత్రి స్ట్రీమింగ్ చేశారు. 'నటుడు .. నాయకుడు .. ప్రజా సేవకుడు' అంటూ ఆయనకి బాలయ్య గ్రాండ్ ఎంట్రీని ఇప్పించారు.

బాలయ్య ప్రశ్నలకు పవన్ స్పందిస్తూ .. "మొదటి నుంచి కూడా నాకు యాక్టింగ్ పై ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే నాకు చాలా బిడియం .. మొహమాటం ఎక్కువ. ఒక సినిమాలో పాట కోసం జగదాంబ సెంటర్లో బస్సు ఎక్కించినప్పుడు ఇక అదే లాస్ట్ సినిమా అనుకున్నాను. అసలు నేను ఒక నాలుగైదు సినిమాలు చేసి మానేద్దామనే ఉద్దేశంతోనే వచ్చాను" అన్నారు. 

"ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలని మా నాన్న చెప్పారు.. నేను అదే పద్ధతిని పాటిస్తున్నాను. నేను ఎప్పుడూ త్రివిక్రమ్ ను ఒక స్నేహితుడిగా కంటే కూడా ఒక గురువుగానే చూస్తుంటాను. నాకు అమ్మంటే చాలా ఇష్టం .. ప్రేమ. కానీ మా నాన్న అంటే మాత్రం చాలా భయం ఉండేది. ఎందుకంటే ఏదైనా కావాలని నేను మొండికేస్తే ఆయన కొట్టేసేవారు" అని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి ఇంటర్వ్యూను 'ఆహా' ఓటీటీలో చూడచ్చు!  

More Telugu News