తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం

  • మొదటి అంతస్తులో ప్రమాదం
  • దట్టంగా అలముకున్న పొగలు
  • షార్ట్ సర్క్యూటే కారణమంటున్న అధికారులు
Fire Accident in Telangana Secretariat

ప్రారంభానికి సిద్ధమవుతున్న తెలంగాణ సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం కూడా సిద్ధమైంది. సచివాలయంలో మొదటి అంతస్తులో ప్రమాదం సంభవించడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్‌ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్టు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News