విద్యా శాఖపై జగన్ సమీక్ష.. కీలక సూచనలు

  • విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నామన్న జగన్
  • విద్యా కానుక కిట్లపై పరిశీలన అవసరమని సూచన
  • విద్యార్థులు ఇంగ్లిష్ లో పట్టు పెంచుకునేలా చూడాలని ఆదేశం
Jagans suggestions on education

విద్యా రంగానికి మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఈ రంగంలో మనం అమలు చేస్తున్న కార్యక్రమాలపై నిరంతర సమీక్ష, పర్యవేక్షణ అవసరమని అన్నారు. ప్రతి ఏటా విద్యా కానుక కింద ఇస్తున్న వస్తువులపై పరిశీలన అవసరమని చెప్పారు. 

6వ తరగతి, ఆ పైన ఉన్న ప్రతి తరగతి గదిలో ఐఎఫ్సీ ప్యానెల్ ను ఏర్పాటు చేస్తున్నామని... దీనివల్ల బోధన విషయంలో ఉపాధ్యాయులకు, నేర్చుకోవడంలో విద్యార్థులకు సులభమవుతుందని చెప్పారు. 8వ తరగతి నుంచి ట్యాబ్ లను ఇస్తున్నామని తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు డిజిటల్ సౌలభ్యాన్ని కల్పించడంపై ఆలోచన చేయాలని చెప్పారు. ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేందుకు వీలుగా విద్యార్థులు ఇంగ్లిష్ లో పట్టు పెంచుకునేలా చూడాలని ఆదేశించారు.

More Telugu News