'బుట్టబొమ్మ' సెకండాఫ్ టెన్షన్ పెట్టేస్తుంది: ప్రీ రిలీజ్ ఈవెంటులో సిద్ధూ జొన్నలగడ్డ

  • ఈ నెల 4వ తేదీన 'బుట్టబొమ్మ' రిలీజ్
  • హైదరాబాదులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • చీఫ్ గెస్టుగా వచ్చిన సిద్ధూ జొన్నలగడ్డ 
  • కథనే ఈ సినిమాకి హీరో అని వ్యాఖ్య   
Buttabomma pre release event

గ్రామీణ నేపథ్యంలో వచ్చిన చాలా ప్రేమకథలు ప్రేక్షకుల మనసులను దోచుకున్నాయి. అలాంటి ఒక విలేజ్ నేపథ్యంలో రూపొందిన సినిమాగా 'బుట్టబొమ్మ' వస్తోంది. అనిఖ సురేంద్రన్ - సూర్య వశిష్ఠ జంటగా నటించిన ఈ సినిమా, ఈ నెల 4వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. 

ఈ ఫంక్షన్ కి మారుతి .. సంపత్ నంది .. శైలేశ్ కొలను .. లక్ష్మణ్ .. అనుదీప్ తదితరులు హాజరయ్యారు. అందరూ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలనే అభిలషను వ్యక్తం చేశారు. అనిఖ సురేంద్రన్ ఈవెంటుకి వచ్చిందిగానీ, హెల్త్ బాగులేని కారణంగా ఆమె రెండు ముక్కలు మాత్రమే మాట్లాడింది. 

ఆ తరువాత ముఖ్య అతిథిగా వచ్చిన సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడుతూ .. "ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ చూశాను. ఈ సినిమాకి కథే హీరో. ఎంత హాయిగా అనిపిస్తుందో .. అంత టెన్షన్ కూడా పెట్టేస్తుంది. సెకండాఫ్ లో ఆడియన్స్ తప్పకుండా షాక్ అవుతారు. ఈ సినిమాకి ఆర్టిస్టులతో పాటు అన్నీ కుదిరాయి. ముఖ్యంగా పాటలు అందరికీ కనెక్ట్ అయ్యాయి. ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన థియేటర్స్ కి వస్తుంది. తప్పకుండా వెళ్లి చూడండి" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News