పెళ్లి పీటలు ఎక్కుతున్న కియారా అద్వానీ.. పంజాబీ సంప్రదాయంలో వివాహం

  • ఫిబ్రవరి 6న కియారా, సిద్ధార్థ్ ల పెళ్లి
  • జైసల్మేర్ లోని ప్యాలస్ లో వివాహం
  • ఢిల్లీ, ముంబైలలో రిసెప్షన్
Kiara Advani and Siddharth Malhotra marriage

బాలీవుడ్ ప్రేమ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాలు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఫిబ్రవరి 6న వీరి వివాహం జరగబోతోందని బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నెల 4, 5 తేదీల్లో వివాహానికి సంబంధించిన హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరగనున్నాయి. రాజస్థాన్ జైసల్మేర్ లోని ప్యాలెస్ లో పంజాబీ సంప్రదాయంలో వీరి వివాహం జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు పూర్తయ్యాయని చెపుతున్నారు. 

ఇక ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొందరు ప్రముఖులు మాత్రమే హాజరుకానున్నట్టు సమాచారం. రాజస్థానీ సంప్రదాయ వంటకాలను అతిథులకు వడ్డించనున్నారు. పెళ్లి అనంతరం ఢిల్లీ, ముంబైలలో వివాహ రిసెప్షన్లను ఏర్పాటు చేయనున్నారు. 'షేర్షా' సినిమాలో వీరిద్దరూ తొలిసారి నటించారు. అనంతరం ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇప్పుడు వైవాహిక బంధంతో ఒక్కటి కాబోతున్నారు.

More Telugu News