అర్జున్ దాస్ ను ఎంచుకోవడంతోనే 'బుట్టబొమ్మ' సగం సక్సెస్ అయింది: మారుతి

  • ఈ నెల 4న రిలీజ్ కానున్న 'బుట్టబొమ్మ'
  • హైదరాబాదులో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ముఖ్య అతిథిగా వచ్చిన సిద్ధూ జొన్నలగడ్డ 
  • ట్రైలర్ తో ఈ సినిమాపై నమ్మకం పెరిగిందన్న మారుతి
Buttabomma pre release event

అనిఖ సురేంద్రన్ ప్రధానమైన పాత్రను పోషించిన 'బుట్టబొమ్మ' ఈ నెల 4వ తేదీన థియేటర్లకు రానుంది. 'కప్పేలా' అనే మలయాళ సినిమాకి ఇది రీమేక్. సితార నాగవంశీ - ఫార్చ్యూన్ ఫోర్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి శౌరి చంద్రశేఖర్ దర్శకత్వం వహించాడు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నేడు హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో నిర్వహించారు. సిద్ధూ జొన్నలగడ్డ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. 

స్పెషల్ గెస్టుగా వచ్చిన మారుతి మాట్లాడుతూ .. "ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ 'కప్పేలా' చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చిన సినిమాల్లో అది ఒకటి. ఆ సినిమాను గురించి సితార నాగవంశీ గారు .. నేను సరదాగా మాట్లాడుకున్నాము. ఆ వెంటనే ఆయన ఈ సినిమా రీమేక్ కి రెడీ అయ్యారు. అర్జున్ దాస్ ను తీసుకొచ్చి ఆ పాత్రకి సెట్ చేయడంలోనే ఆయన సగం సక్సెస్ అయ్యాడు" అన్నాడు. 

"రీసెంట్ గా వదిలిన ట్రైలర్ చూసిన తరువాత నాకు ఈ సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. గణేశ్ రావూరి గారి డైలాగ్స్ నాకు బాగా నచ్చాయి. సాధారణంగా రీమేక్ సినిమాలను ఒరిజినల్ కంటే తక్కువ బడ్జెట్ లో తీస్తుంటారు. కానీ ఈ సినిమా విషయంలో ఒరిజినల్ కంటే ఎక్కువ బడ్జెట్ అయ్యుంటుంది. చిన్న సినిమాలను కూడా క్వాలిటీతో అందించడం సితార ప్రత్యేకత అని నాగవంశీ మరోసారి నిరూపించారు" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News