టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు

  • కుటుంబ పార్టీలతో పొత్తు ఉండదన్న సోము వీర్రాజు
  • జనసేనతో పొత్తు ఉంటుందని వ్యాఖ్య
  • ఇటీవలి కాలంలో టీడీపీకి దగ్గరవుతున్న పవన్
Somu Veerraju gives clarity on alliances

రానున్న ఎన్నికల్లో పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు క్లారిటీని ఇచ్చారు. టీడీపీ, వైసీపీలతో కలిసే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. కుటుంబ పార్టీలతో పొత్తు ఉండదని చెప్పారు. జనసేనతోనే పొత్తు ఉంటుందని తెలిపారు. ఇటీవలి కాలంలో టీడీపీతో జనసేనాని పవన్ కల్యాణ్ దగ్గరవుతున్న తరుణంలో సోము వీర్రాజు వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. వాస్తవానికి బీజేపీ, జనసేనలు ఇప్పటికీ పొత్తులోనే ఉన్నాయి. కానీ, రెండు పార్టీలూ ఇప్పటి వరకు ఎప్పుడూ కలిసి పని చేసిన దాఖలాలు లేవు. ఇటీవల జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో సైతం జనసేన అంశం ప్రస్తావనకు రాలేదు. దీంతో, రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

More Telugu News