మెగాస్టార్ ను మెప్పించిన 'ధమాకా' డైరెక్టర్?

  • మాస్ పల్స్ తెలిసిన త్రినాథరావు నక్కిన 
  • 'ధమాకా'తో లభించిన భారీ హిట్ 
  • ఇటీవలే మెగాస్టార్ కి వినిపించిన కథ 
  • ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ ప్రచారం 
  • నిర్మాణ సంస్థగా డీవీవీ బ్యానర్  
Chiranjeevi in Nakkina Trinatha Rao Movie

చిరంజీవి ఒకేసారి లైన్లో పెట్టిన మూడు సినిమాలలో ఆల్రెడీ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక 'భోళా శంకర్' మాత్రమే షూటింగు దశలో ఉంది. మెహర్ రమేశ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ తరువాత ప్రాజెక్టును ఆయన ఏ డైరెక్టర్ తో చేయనున్నాడనే ఆసక్తి అందరిలో తలెత్తుతోంది. 

ఈ విషయంలో నక్కిన త్రినాథరావు పేరు తెరపైకి వచ్చింది. ఇటు యూత్ .. అటు మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడిగా ఆయనకి మంచి పేరు ఉంది. ఇటీవల రవితేజతో ఆయన చేసిన 'ధమాకా' సినిమాకి వసూళ్ల వర్షం కురిసేసింది. కథాకథనాల పరంగానే కాకుండా మ్యూజికల్ హిట్ గాను నిలిచింది. 

అలాంటి త్రినాథరావు రీసెంట్ గా చిరంజీవిని కలిసి ఒక లైన్ వినిపించాడట. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో మెగాస్టార్ వెంటనే ఒప్పేసుకున్నాడని అంటున్నారు. డీవీవీ దానయ్య ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడని చెబుతున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు.

More Telugu News