లోకేశ్ ప్రచార రథాన్ని సీజ్ చేసేందుకు పోలీసుల యత్నం
- పలమనేరులో కొనసాగుతున్న పాదయాత్ర
- అనుమతి లేదంటూ లోకేశ్ ప్రచారరథాన్ని సీజ్ చేసేందుకు పోలీసుల యత్నం
- పోలీసులతో టీడీపీ శ్రేణుల వాగ్వాదం
ఈ సందర్భంగా పోలీసుల యత్నాన్ని టీడీపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గి, ప్రచార రథాన్ని వదిలేశారు. మరోవైపు లోకేశ్ ఏడో రోజు యాత్ర పలమనేరులోని రామాపురం నుంచి ప్రారంభమయింది. క్యాంప్ సైట్ వద్ద ఎంసీ పాలెంకు చెందిన 20 మంది యువత, రంగాపురంకు చెందిన 20 కుటుంబాలు, పలమనేరు పెద్ద మసీదు వీధికి చెందిన 20 ముస్లిం కుటుంబాలు, మాజీ సర్పంచ్ టీడీపీలో చేరారు.