ఆ ఇద్దరికంటే ఒకడుగు ముందే ఉన్న రష్మిక!

  • టాలీవుడ్లో తగ్గని రష్మిక క్రేజ్ 
  • న్యూ ఇయర్ ఆరంభంలోనే రెండు హిట్లు 
  • 'మిషన్ మజ్ను'తో హిందీలోనూ కుదురుకున్నట్టే
  • ఒక అడుగు వెనకే ఉన్న పూజ హెగ్డే - కీర్తి సురేశ్
Rashmika Special

టాలీవుడ్ లో టాప్ త్రీ పొజిషన్లలో పూజ హెగ్డే .. రష్మిక మందన్న .. కీర్తి సురేశ్ కనిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ముగ్గురిలో రష్మికదే ముందడుగు అని చెప్పాలి. క్రితం ఏడాది మూడు పరాజయాలు పూజ ఎకౌంట్లో పడ్డాయి. ఈ ఏడాదిలో ఇప్పట్లో ఆమె నుంచి సినిమా వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఒక రకంగా ఆమె ప్లానింగ్ లోపంగానే చెప్పాలి. 

ఇక కీర్తి సురేశ్ విషయానికొస్తే .. క్రితం ఏడాది ఆమె నుంచి వచ్చిన 'సర్కారువారి పాట' సక్సెస్ అనిపించుకుంది. అయితే మహేశ్ కి గల క్రేజ్ పరంగా చూసుకుంటే మాత్రం, ఆ స్థాయిని రీచ్ కాలేదని తేల్చేశారు. మార్చి 30వ తేదీన ఆమె నుంచి 'దసరా' రానుంది. 'భోళా శంకర్' కూడా లైన్లో ఉన్నప్పటికీ, ఆ సినిమాలో ఆమె చెల్లెలు పాత్రలో కనిపిస్తుంది గనుక అది లెక్కలోకి రాదనే చెప్పాలి. 

రష్మిక మాత్రం తమిళ .. తెలుగు భాషల్లో 'వారసుడు' సినిమాతో హిట్ కొట్టింది. తమిళంలో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. అయితే ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదనే విమర్శలు వచ్చాయి. ఆ బాధ కాస్తా హిందీలో వచ్చిన 'మిషన్ మజ్ను' తీర్చేసింది. ఈ సినిమా హిట్ తో ఆమె మనసు తేలికపడింది. మొత్తానికి ఏడాది ఆరంభంలోనే రష్మిక రెండు హిట్లను పట్టుకుపోయిందన్న మాట.

More Telugu News