‘సెల్ఫీ’ కోసం అక్షయ్, టైగర్ ‘ఖిలాడీ’ డ్యాన్స్.. వీడియో వైరల్

  • టైగర్ ష్రాఫ్ తో కలిసి ఇన్ స్టా రీల్  చేసిన అక్షయ్ కుమార్
  • 1994లో వచ్చిన ‘మైన్ ఖిలాడీ’ పాటకు స్టెప్పులు
  • లైక్ ల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు
Akshay Kumar And Tiger Shroff Dance To Main Khiladi

‘సెల్ఫీ’ సినిమా ప్రమోషన్స్ లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ బీజీగా ఉన్నాడు. ఫిబ్రవరి 24న రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం వీలైనంత ఎక్కువ ప్రచారం చేస్తున్నాడు. ఇందులో భాగంగా మరో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో కలిసి ఇన్ స్టా రీల్ చేశాడు.

1994లో వచ్చిన తన సినిమాలోని ‘మైన్ ఖిలాడీ’ పాటకు అక్షయ్, టైగర్ ష్రాఫ్ చేసిన డ్యాన్స్ వీడియోను గురువారం ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. కొన్ని సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో.. ఇద్దరు స్టార్స్ డ్యాన్స్ మూమెంట్స్ తో ఇరగదీశారు. దీంతో వీడియోకు లైక్ ల వర్షం కురుస్తోంది. 20 లక్షల మందికి పైగా లైక్ చేశారు. వేల కామెంట్లు వస్తున్నాయి. 

‘‘మైన్ ఖిలాడీ పాటకు నాతో టైగర్ ష్రాఫ్ డ్యాన్స్ చేశాడు. ఇదిగో ఇలా జరిగింది. మీరు మీ బెస్టీతో మెయిన్‌ ఖిలాడీ రీల్‌ను ఎలా చేస్తారు?  నేను రీపోస్ట్ చేస్తాను’’అని అక్షయ్ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు కలిసి ‘బడే మియా.. చోటే మియా’ సినిమాలో నటిస్తున్నారు. 

‘మైన్ ఖిలాడీ’ పాటను సెల్ఫీ సినిమాలో రీమిక్స్ చేశారు. 1994లో వచ్చిన సినిమాలో అక్షయ్, సైఫ్ అలీఖాన్ కలిసి నటించారు. ఇక 2019లో వచ్చిన మలయాళం సినిమా ‘డ్రైవింగ్ లైసెన్స్’కు రీమేక్ గా ‘సెల్ఫీ’ ని రూపొందించారు. ఇందులో అక్షయ్, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

More Telugu News