అందుకే నాతో సినిమాలు చేయడానికి ఎవరూ రావడం లేదు: దర్శకుడు కృష్ణవంశీ

  • కృష్ణవంశీ తాజా చిత్రంగా 'రంగమార్తాండ'
  • ఒక నాటకరంగ నటుడి చుట్టూ తిరిగే కథ ఇది
  • ఈ కథను ప్రకాశ్ రాజ్ డైరెక్ట్ చేయాలనుకున్నాడన్న కృష్ణవంశీ
  • మరాఠీ 'నట సామ్రాట్'కి రీమేక్ అని వెల్లడి
Krishnavamshi Interview

కృష్ణవంశీ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రంగమార్తాండ' రెడీ అవుతోంది. తాజా ఇంటర్వ్యూలో కృష్ణవంశీ మాట్లాడుతూ .. " నేను ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నానని అంతా అడుగుతున్నారు. గ్యాప్ నేను తీసుకోలేదు .. వచ్చింది. 'నక్షత్రం' సినిమా ఫ్లాప్ కావడం వలన, నాతో సినిమా చేయడానికి ఎవరూ సాహసించలేదు అంతే.. తమ డబ్బు వెనక్కిరాదని అనిపించినప్పుడు సహజంగానే నిర్మాతలు భయపడతారు" అన్నారు. 

'రంగమార్తాండ' సినిమాను ఇప్పుడున్న పరిస్థితులలో తీయడం చాలా అవసరం. రాఘవరావు అనే నాటక రంగ నటుడు రిటైర్మెంట్ తీసుకోవడంతో ఈ కథ మొదలవుతుంది. ఆ తరువాత నిజ జీవితంలో తన పాత్రను తాను పోషించడంలో ఆయన ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేదే కథ. డబ్బు అనేది బంధాలను .. అనుబంధాలను ఎలా విషపూరితం చేస్తుందనే పాయింట్ ఇందులో కనిపిస్తుంది" అని చెప్పారు. 

'నిజానికి ఈ సినిమాను ప్రకాశ్ రాజ్ తీయాలనుకున్నారు. కానీ ఆ తరువాత నేనైతే పూర్తి న్యాయం జరుగుతుందని చెప్పి నా చేతుల్లో పెట్టారు. బాలీవుడ్ లో ఈ సినిమాను చేయడానికి చాలామంది ట్రై చేశారు గానీ కుదరలేదు. చివరికి మహేశ్ మంజ్రేకర్ - నానా పటేకర్ కలిసి మరాఠీలో 'నట సామ్రాట్' పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ కథనే నా స్టయిల్లో ఉంటుంది" అని చెప్పుకొచ్చారు. 


More Telugu News