సూసైడ్ బాంబర్ చెకింగ్ ను ఇలా తప్పించుకున్నాడట..!

  • పాకిస్థాన్ మసీదులో పేలుడు ఘటనపై అధికారుల వివరణ
  • పోలీసు యూనిఫాంలో వచ్చి ఆత్మాహుతి దాడి చేసిన ఉగ్రవాది
  • యూనిఫాంలో రావడంతో భద్రతా సిబ్బంది సరిగా తనిఖీ చేయలేదని వెల్లడి
security laps are there says pakistan police officials on peshawar blast

పాకిస్థాన్ లోని పెషావర్ ఇటీవల ఓ మసీదులో బాంబు పేలి 101 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. చనిపోయిన వారిలో ఎక్కువమంది పోలీసులు, మిలటరీ అధికారులేనని పోలీసులు చెప్పారు. మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా లోపలికి ప్రవేశించిన ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని వివరించారు. అయితే, పోలీసు హెడ్ క్వార్టర్ ఆవరణలో ఉండడంతో ఈ మసీదుకు పటిష్ఠమైన సెక్యూరిటీ ఉంటుంది. అలాంటిచోటికి ఉగ్రవాది బాంబులతో ఎలా రాగలిగాడనేది ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా ఆ చిక్కుముడి వీడిందని ఉన్నతాధికారులు తెలిపారు. 

మసీదులో కూలిన శిథిలాలను తొలగిస్తుండగా శరీరం నుంచి విడిపోయిన ఒక తలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అది దాడికి పాల్పడిన ఉగ్రవాది తలే అయుంటుందని అనుమానించి, పరిశోధన చేసినట్లు వివరించారు. మసీదు ఆవరణతో పాటు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించాక ఉగ్రవాది అతడేనని తేలిందన్నారు. సదరు యువకుడు పోలీసు యూనిఫాంలో మసీదులోకి ప్రవేశించడం ఓ సీసీ టీవీ కెమెరా రికార్డు చేసిందన్నారు. యూనిఫాంతో లోపలికి రావడం వల్లే భద్రతా సిబ్బంది సరిగా చెక్ చేయలేదని ఉన్నతాధికారులు తెలిపారు.

More Telugu News