కష్టాల్లో వున్న సీనియర్ కెమెరామెన్ కు ఆర్ధిక సాయాన్ని అందించిన మెగాస్టార్!

  • కెమెరామెన్ గా పనిచేసిన దేవరాజ్ 
  • ఆయన జాబితాలో 300లకి పైగా సినిమాలు
  • మేజర్ యాక్సిడెంట్ వలన నడవలేని పరిస్థితి 
  • మందులకు డబ్బులు లేవని ఆవేదన 
  • 5 లక్షల చెక్ ను అందించిన మెగాస్టార్
 Chiranjeevi Helped Senior Cameraman Devaraj

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన చాలామంది, ఆ తరువాత ఆర్ధిక పరమైన ఇబ్బందులను అనుభవించారు. ఈ జాబితాలో నటీనటులు మాత్రమే కాదు .. టెక్నీషియన్లు కూడా ఉన్నారు. అలాంటివారిలో సీనియర్ సినిమాటోగ్రఫర్ పి.దేవరాజ్ కూడా కనిపిస్తారు. తాజాగా ఆయనకి చిరంజీవి 5 లక్షల ఆర్ధిక సాయాన్ని అందించారు. 

"రీసెంటుగా సుమన్ టీవీలో సీనియర్ కెమెరామెన్ దేవరాజ్ ఇంటర్వ్యూ వచ్చింది. తెలుగు .. తమిళ ... మలయాళ .. బెంగాలీ భాషల్లో ఆయన 300 సినిమాలకి పైగా పనిచేశారు. అలాంటి ఆయనకి ఆ మధ్య మేజర్ యాక్సిడెంట్ జరిగిందట. అప్పటి నుంచి ఆయన సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్నారు. 

తనకి రోజు గడవడమే కష్టంగా ఉందనీ .. మందులకు కూడా డబ్బులు లేవని ఆయన ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక్కోసారి చనిపోవాలనిపిస్తుందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విషయం చిరంజీవి దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆయన దేవరాజ్ ను కలిసి ఆర్ధిక సాయంగా 5 లక్షల రూపాయల 'చెక్'ను అందజేశారు. గతంలో చిరంజీవీ నటించిన 'టింగు రంగడు' .. 'రాణికాసుల రంగమ్మ' .. 'నాగు' .. 'పులి బెబ్బులి' సినిమాలకి ఆయన పనిచేశారు.  

More Telugu News