అందాల బుట్టబొమ్మ .. పూజ హెగ్డే లేటెస్ట్ పిక్స్ !

  • క్రితం ఏడాది వరుస ఫ్లాపులు ఎదుర్కున్న పూజ హెగ్డే
  • ఈ ఏడాది మహేశ్ మూవీతో సెట్స్ పైకి 
  • తమిళ .. హిందీ భాషల్లోను కుదురుకునే ప్రయత్నం 
  • కొత్త భామల పోటీని తట్టుకుంటూ ముందుకు  
Pooja Hegde Special

తెలుగులో అగ్రకథానాయికగా రాణిస్తున్న పూజ హెగ్డే ఒకానొక సమయంలో వరుస విజయాలతో దూసుకుపోయింది. ఆ తరువాత అంతే స్థాయిలో ఆమె పరాజయాలను ఎదుర్కుంటూ వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన 'రాధే శ్యామ్' .. 'బీస్ట్'తో పాటు 'ఆచార్య'తోను అభిమానులను ఆమె నిరాశపరిచింది.

మూడు భారీ సినిమాలు వెంట వెంటనే ఫ్లాప్స్ తెచ్చిపెట్టినా, ఆమె దిగాలు పడిపోకుండా ముందుకు వెళుతోంది. ప్రస్తుతానికైతే ఆమె ప్లేస్ అలాగే ఉంది. దానిని నిలబెట్టుకోవడం కోసమే ఆమె ట్రై చేస్తోంది. తెలుగులో త్రివిక్రమ్ - మహేశ్ బాబు ప్రాజెక్టుకి సైన్ చేసిన ఆమె, తమిళ .. హిందీ భాషల్లోను పట్టు దొరికించుకోవడానికి ప్రయత్నిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఆమె లేటెస్ట్ పిక్స్ ను వదిలారు. వైలెట్ కలర్ డ్రెస్ లో పూజ మెరిసిపోతోంది. రొమాంటిక్ స్టిల్స్ తో యూత్ కి మత్తెక్కిస్తోంది. హాట్ లుక్స్ తో కుర్రమనసులకు కుదురులేకుండా చేస్తోంది. కొత్త భామలు ఎంతమంది ఎంట్రీ ఇచ్చినా, ఇప్పట్లో ఈ పొడుగుకాళ్ల సుందరికి ఢోకా లేనట్టే అనే ఆలోచన కలిగిస్తోంది.

More Telugu News