షూటింగ్ బ్రేక్ లో బ్యాటు పట్టిన త్రివిక్రమ్.. వీడియో ఇదిగో!

  • మహేశ్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ పనుల్లో బిజీబిజీ
  • హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్
  • బ్రేక్ లో క్రికెట్ ఆడుతున్న స్టార్ డైరెక్టర్
Director Trivikram Srinivas Plays Cricket In SSMB 28 Movie Shooting Sets Watch Vide

సూపర్ స్టార్ మహేశ్ బాబు, పూజ హెగ్డే జంటగా, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబీ 28.. ఈ ప్రాజెక్టు షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎస్ఎస్ఎంబీ 28 సెట్స్ లో డైరెక్టర్ త్రివిక్రమ్ కాసేపు దర్శకత్వ బాధ్యతలను పక్కన పెట్టి క్రికెటర్ గా మారాడు. సెట్స్ లోనే బ్యాటు పట్టి క్రికెట్ ఆడారు. షూటింగ్ బ్రేక్ టైంలో మిగతా వారితో కలిసి సరదాగా ఆయన క్రికెట్ ఆడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రంగస్థలం మహేశ్ ను కూడా చూడవచ్చు.

ఈ సినిమాలో పూజ హెగ్డే కథానాయిక కాగా, మరో కీలక పాత్రలో శ్రీలీల కూడా కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. వచ్చే ఆగస్టు 11న ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

More Telugu News