రేపు రిలీజ్ అవుతున్న 'తుపాకుల గూడెం'

  • ఫారెస్టు నేపథ్యంలో నడిచే 'తుపాకుల గూడెం'
  • కొత్త నటీనటులతో చేసిన ప్రయోగం
  • ఆసక్తిని రేపుతూ వచ్చిన అప్ డేట్స్ 
  • మణిశర్మ సంగీతమే ప్రత్యేక ఆకర్షణ
  • రేపు విడుదలవుతున్న సినిమా   
Thupakula Gudem Movie Update

అడవి నేపథ్యంలో నడిచే కథలతో ఇంతకుముందు చాలానే సినిమాలు వచ్చాయి. అలాంటి ఒక నేపథ్యంలో వచ్చిన మరో సినిమానే 'తుపాకుల గూడెం'. అయితే దీని లైన్ వేరు .. ట్రీట్మెంట్ వేరు. టైటిల్ కి తగినట్టుగానే ఈ సినిమాలో తుపాకులు కనిపిస్తుంటాయి .. కాల్పులు వినిపిస్తుంటాయి. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

ఈ సినిమా టీజర్ కీ .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక వైపున ఫారెస్టులో కలపను అక్రమంగా తరలించడం .. మరో వైపున నక్సలిజం నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనే విషయం అర్ధమైపోతోంది. ఈ మధ్యలో చిన్నపాటి ప్రేమ వ్యవహారం కూడా ఉందనే విషయం స్పష్టమవుతోంది.

కలప అక్రమ వ్యాపారం చేసే రాజన్న దగ్గర, తుపాకుల గూడానికి చెందిన కుమార్ అనే యువకుడు పనిచేస్తూ ఉంటాడు. అతను చేసిన ఒక పనివలన ఆ ఊరు ఎలాంటి ప్రమాదంలో పడిందనేదే కథ. శ్రీకాంత్ రాథోడ్ .. జయేత్రి .. ప్రవీణ్ .. శివరామరెడ్డి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం హైలైట్ గా నిలవనుంది.

More Telugu News