యూత్ ను ఆకట్టుకునే 'శశివదనే' సాంగ్!

  • కొత్త దర్శకుడు రూపొందించిన 'శశివదనే'
  • గ్రామీణ నేపథ్యంలో నడిచే ప్రేమకథ
  • హీరోగా పరిచయమవుతున్న రక్షిత్ అట్లూరి  
  • సంగీత దర్శకత్వం వహించిన వాసుదేవన్ 
Sasivadane lyrical song released

తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి మరో ప్రేమకథ రెడీ అవుతోంది. గ్రామీణ నేపథ్యంలో .. నిర్మలంగా ప్రవహించే 'నది'లాంటి ప్రేమకథ ఇది. 'శశివదనే' అనే టైటిల్ లో రూపొందిన ఈ సినిమా, యూత్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మించినది. అహితేజ నిర్మించిన ఈ సినిమాకి సాయిమోహన్ దర్శకత్వం వహించాడు. 

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది టైటిల్ సాంగ్. 'నాలో నేను ఏవో కలలు కంటున్నానుగా .. నీతో చేరి ఆ కలలు అన్నీ నిజమవుతాయిగా' అంటూ ఈ పాట మొదలవుతోంది. 

హీరో .. హీరోయిన్లపై అందమైన గ్రామీణ నేపథ్యంలో ఈ పాటను చిత్రీకరించారు. వాసుదేవన్ అందించిన బాణీకి .. కిట్టు విస్సాప్రగడ సాహిత్యాన్ని సమకూర్చగా, హరిచరణ్ - చిన్మయి శ్రీపాద ఆలపించారు. కొంతకాలంగా తెలుగులో చేస్తూ వస్తున్న కోమలీ ప్రసాద్ కి ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి.

More Telugu News