విజయ్ 67వ సినిమాలో త్రిష ఖరారు .. పోస్టర్ రిలీజ్!

  • విజయ్ 67వ సినిమాకి సన్నాహాలు 
  • ప్రత్యేకమైన ఆకర్షణగా భారీ తారాగణం 
  • సంగీత దర్శకుడిగా అనిరుధ్ 
  • 14 ఏళ్ల తరువాత విజయ్ తో చేస్తున్న త్రిష   
Trisha in Vijay Movie

తమిళనాట విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. 'బీస్ట్' తరువాత ఆయన మరో భారీ బడ్జెట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. సెవెన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కెరియర్ పరంగా ఇది ఆయనకి 67వ సినిమా. 

అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న వారి పోస్టర్లను మేకర్స్ వరుసగా రివీల్ చేస్తూ వస్తున్నారు. సంజయ్ దత్ .. యాక్షన్ కింగ్ అర్జున్ .. మన్సూర్ అలీఖాన్ .. గౌతమ్ మీనన్ .. ప్రియా ఆనంద్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలలో కనిపించనున్నట్టు చెబుతూ పోస్టర్లను వదిలారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ తాజాగా త్రిష పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో విజయ్ సరసన కథానాయికగా ఆమె అలరించనుంది. 14 ఏళ్ల తరువాత ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఇక 'మాస్టర్' తరువాత మళ్లీ విజయ్ - లోకేశ్ కనగరాజ్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు ఉన్నాయి.

More Telugu News