జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటా: సినీ నిర్మాత దాసరి కిరణ్

  • టీటీడీ సభ్యుడిగా కిరణ్ ను నియమించిన జగన్
  • తెనాలిలో కిరణ్ కు సన్మాన కార్యక్రమం
  • జగన్ రూపంలో ఆ దేవుడే ఈ భాగ్యాన్ని ఇచ్చాడన్న కిరణ్
Tollywood prodicer Dasari Kiran thanks Jagan

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సినీ నిర్మాత దాసరి కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. తనను టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. దాసరి కిరణ్ కుమార్ టీటీడీ బోర్డు మెంబర్ అయిన సందర్భంగా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షతన తెనాలిలో ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి మేరుగ నాగార్జున, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, బాపట్ల ఎంపీ నందిగామ సురేశ్, సినీ దర్శకులు బాబి, త్రినాథరావు తదితరులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ, టీడీడీ బోర్డు మెంబర్ అనేది ఒక పదవి కాదని.. శ్రీవేంకటేశ్వరస్వామికి చేసే సేవ అని చెప్పారు. జగన్ రూపంలో ఆ దేవుడే తనకు ఈ భాగ్యాన్ని ఇచ్చినట్టు అన్నారు. మరోవైపు మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ, కిరణ్ లాంటి మంచి వ్యక్తికి శ్రీవారికి సేవ చేసుకునే అదృష్టం కలగడం సంతోషంగా ఉందని చెప్పారు. దర్శకుడు బాబీ చెబుతూ.. తాను చిరంజీవి అభిమానిగా ఉన్నప్పటి నుంచి దాసరి కిరణ్ తనకు పరిచయం అని చెప్పారు. కిరణ్ చేసిన సేవా కార్యక్రమాల గురించి తనకు తెలుసని అన్నారు. ఆ మంచి తనమే కిరణ్ ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పారు.

More Telugu News