కీర్తి సురేశ్ పెళ్లి వార్తలపై స్పష్టతనిచ్చిన తల్లి

  • చిన్ననాటి స్నేహితుడితో త్వరలో కీర్తి పెళ్లి అని వార్తలు
  • అవన్నీ పుకార్లే అని స్పష్టం చేసిన తల్లి మేనక
  • గతంలోనూ కీర్తి ప్రేమ, పెళ్లి గురించి పుకార్లు  
Senior Actress Menaka Clarifies On daughter Keerthi Suresh Marriage Rumours

సినీ కుటుంబం నుంచి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్ గా ఎదిగిన వ్యక్తి కీర్తి సురేశ్. మహానటి చిత్రంతో జాతీయ అవార్డుతో పాటు ఎంతో పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఆరు సినిమాలున్నాయి. అయితే ఆమె పెళ్లి గురించి తరచూ పుకార్లు వస్తున్నాయి. త్వరలోనే తను పెళ్లి పీటలు ఎక్కనుందనే ప్రచారం గత కొన్నిరోజులుగా జరుగుతోంది. తన చిన్ననాటి స్నేహితుడిని ఆమె పెళ్లాడనుందని, ఆయన వ్యాపారవేత్త అని ప్రచారం ఊపందుకుంది. చాలా ఏళ్ల నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని పుకార్లు వచ్చాయి. వీటిపై కీర్తి సురేశ్ తల్లి, ఒకప్పటి నటి మేనక స్పందించారు. 

తన కూతురు పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ పుకార్లే అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె తన కెరీర్‌‌ను మాత్రమే ప్రేమిస్తోందని చెప్పారు. ఇలాంటి తప్పుడు వార్తలు, పుకార్లను నమ్మొద్దన్నారు. కీర్తి విషయంలో ఇలాంటి పుకార్లు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌తో, హీరో విజయ్‌తో కీర్తి ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ, అవి పుకార్లే అని తెలింది. కాగా, నాని సరసన కీర్తి నటించిన ‘దసరా’ విడుదల కానుంది. అలాగే, చిరంజీవి చెల్లెలుగా ‘భోళా శంకర్‌‌’ సినిమాలోనూ కీర్తి నటిస్తోంది. నాలుగు తమిళ చిత్రాల్లోనూ కీర్తి నటిస్తోంది.

More Telugu News