Infinix: ఇన్ఫినిక్స్ నుంచి ప్రీమియం ల్యాప్ టాప్ లు

Infinix Zerobook with up to 12th Gen Intel Core i9 processor launched in India
  • పలు వేరియంట్లుగా విడుదల
  • ఇంటెల్ కోర్ ఐ5 నుంచి కోర్ ఐ9తో కూడిన మోడళ్లు
  • వీటి ధరలు రూ.49,990 నుంచి ప్రారంభం
  • మెటల్ బాడీ, స్లీక్ డిజైన్
ఇన్ఫినిక్స్ సంస్థ భారత మార్కెట్లోకి మరిన్ని ల్యాప్ టాప్ లను ప్రవేశపెట్టింది. ఇన్ఫినిక్స్ జీరోబుక్ పేరుతో నాలుగు వేరియంట్లుగా దీన్ని తీసుకొచ్చింది. ఇంటెల్ కోర్ ఐ5 వేరియంట్ ధర రూ.49,990. కోర్ ఐ7 ధర రూ.64,990, కోర్ ఐ9 ధర (16జీబీ) రూ.79,990, కోర్ ఐ9 (1టీబీ) ధర రూ.84,990. 

ఇన్ఫినిక్స్ జీరోబుక్ డిజైన్ యాపిల్ మ్యాక్ బుక్ స్ఫూర్తితో కనిపిస్తుంది. స్లీక్ డిజైన్ తో ఉంటుంది. పూర్తిగా మెటల్ బాడీతో జీరోబుక్ 16.9 ఎంఎం మందంతో ఉంటుందని ఇన్ఫినిక్స్ తెలిపింది. అంటే మ్యాక్ బుక్ కంటే మందమే అని తెలుస్తోంది. జీరోబుక్ 15.6 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే, ఫుల్ హెడ్ డీ రిజల్యూషన్, ఏఐ బ్యూటీ క్యామ్ తో వస్తుంది. 

ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్ కార్డ్ తో ఉంటుంది. సింగిల్ ఎస్డీ కార్డ్ స్లాట్, 3.5 ఎంఎం ఇయర్ ఫోన్ జాక్, యూఎస్ బీ 3.0 స్లాట్ ఉంటాయి. వైఫై 6ఈ బ్లూటూత్ 5.2 సపోర్ట్ తో వస్తుంది. డ్యుయల్ మైక్, ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయాలు కూడా ఉన్నాయి. 70వాట్ అవర్ బ్యాటరీ, 96వాట్ చార్జర్ తో వస్తుంది. రెండు గంటల్లో ల్యాప్ టాప్ పూర్తిగా చార్జ్ అవుతుంది.
Infinix
Zerobook
Intel Core i9 processor
launched

More Telugu News