తారకరత్న ఆరోగ్యంపై నేడు నివేదిక వెల్లడించనున్న వైద్యులు

  • తారకరత్న ఆరోగ్యంపై నిన్న హెల్త్ బులెటిన్ విడుదల చేయని వైద్యులు
  • మరిన్ని వైద్య పరీక్షల అనంతరం నివేదిక విడుదల చేస్తామన్న ఆసుపత్రి వర్గాలు
  • ఆసుపత్రిలోనే తండ్రి, భార్య, కుటుంబ సభ్యులు
Doctors Today to release health bulletin about actor tarakaratna

నటుడు తారకరత్న ఆరోగ్యంపై వైద్యులు నేడు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేయనున్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. తారకరత్న ఆరోగ్యంపై వైద్యులు నిన్న ఎలాంటి నివేదిక విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో నేడు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేయనున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరిన్ని వైద్య పరీక్షల అనంతరం నివేదిక వెల్లడిస్తామని పేర్కొన్నాయి. తారకరత్న తండ్రి మోహనకృష్ణ, భార్య అలేఖ్య, ఇతర కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నారు.

జనవరి 27న లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొనేందుకు వెళ్లిన తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. దీంతో ఆయనకు కుప్పం ఆసుపత్రిలో చికిత్స అందించిన అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించారు. తారకరత్న ఆరోగ్యం విషమంగా ఉందన్న వార్తల నేపథ్యంలో నిన్న చిరంజీవి చేసిన ట్వీట్ అందరిలోనూ సంతోషాన్ని నింపింది. 

తారకరత్న కోలుకుంటున్నాడని, ఆయనకు ఇక ఎలాంటి ప్రమాదం లేదన్న మాట తనకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చిందని చిరంజీవి ట్వీట్ చేశారు. తారకరత్నను కాపాడిన వైద్యులకు, భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్టు చిరంజీవి చేసిన ట్వీట్ అందరికీ బోల్డంత ఉపశమనం ఇచ్చింది.

More Telugu News