Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు అర్జంట్ అప్ డేట్

  • పాత వెర్షన్ లో లోపాలు ఉన్నాయన్న కేంద్ర ప్రభుత్వం
  • వెంటనే అప్ డేట్ చేసుకోవాలని సూచన
  • హ్యాకర్ల బారినపడే అవకాశం ఉందని వెల్లడి
Urgent update for Google Chrome old version users

ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన సెర్చింజన్ గూగుల్ క్రోమ్. అయితే, ఇప్పటికీ క్రోమ్ పాత వెర్షన్ ఉపయోగిస్తున్న వారు తక్షణమే అప్ డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్ భద్రతా సంస్థ సీఈఆర్టీ-ఎన్ (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా) అప్రమత్తం చేసింది. 

గూగుల్ క్రోమ్ 109.0.5414.119 (ఆపిల్/లినక్స్).... 109.0.514.119/120 (విండోస్) వెర్షన్ల కంటే ముందు వెర్షన్ వాడుతున్నవారు వెంటనే అప్ డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. క్రోమ్ పాత వెర్షన్ లో కొన్ని లోపాలు ఉన్నాయని, దాంతో హ్యాకర్లు ఎంతో సులభంగా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని సీఈఆర్టీ-ఎన్ వెల్లడించింది. 

వెబ్ ఆర్టీపీ అండ్ గెస్ట్ వ్యూ, టైప్ కన్ఫ్యూజన్ ఎర్రర్, వెబ్ ట్రాన్స్ పోర్ట్ తదితర లోపాలను క్రోమ్ పాత వెర్షన్ లో గుర్తించామని తెలిపింది. ఈ లోపాలతో హ్యాకర్లు ప్రపంచంలో ఎక్కడ్నించైనా సరే కంప్యూటర్లను తమ అధీనంలోకి తీసుకునే వీలుందని పేర్కొంది. హ్యాకర్లు తాము రూపొందించిన వెబ్ పేజ్ ను క్రోమ్ లో ప్రవేశపెడతారని, దీనిపై యూజర్లు క్లిక్ చేస్తే వారి సమాచారం అంతా హ్యాకర్ల వశమవుతుందని వివరించింది.

More Telugu News