Raghu Rama Krishna Raju: విశాఖే రాజధాని అన్న సీఎం జగన్... సీజేఐకి లేఖ రాసిన రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishna Raju wrote CJI on CM Jagan comments over AP Capital
  • విశాఖ ఏపీ రాజధాని కాబోతోందన్న సీఎం జగన్
  • తాను కూడా విశాఖ షిఫ్ట్ అవుతామని వెల్లడి
  • ఇది కోర్టు ధిక్కరణే అన్న రఘురామకృష్ణరాజు
ఏపీ రాజధాని విశాఖేనని, త్వరలోనే తాను విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్నానని సీఎం జగన్ ఇవాళ ఢిల్లీలో పేర్కొనడం తెలిసిందే. దీనిపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కు లేఖ రాశారు. సుప్రీంకోర్టులో ఏపీ రాజధానికి సంబంధించిన అంశం విచారణకు వచ్చే సమయంలో సీఎం జగన్ ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేసినట్టుందని రఘురామ తెలిపారు. నియమావళి ప్రకారం దీన్ని కోర్టు ధిక్కరణగానే భావించాలని తెలిపారు. ఏపీ సీఎం వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే విధంగానే ఉన్నాయని ఆరోపించారు. విశాఖ రాజధాని అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
Raghu Rama Krishna Raju
CJI
AP Capital
Jagan
YSRCP

More Telugu News