నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

  • వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు
  • అవినాశ్ రెడ్డిని విచారించిన సీబీఐ
  • అవినాశ్ ఫోన్ నుంచి నవీన్ కి కాల్స్ వెళ్లినట్టు గుర్తింపు
  • సీఎం క్యాంపు కార్యాలయం ప్రముఖ వ్యక్తి వద్ద పీఏగా చేస్తున్న నవీన్
YV Subbareddy talks about CBI notices to Naveen

వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. సీఎం క్యాంపు కార్యాలయంలోని ఓ పవర్ సెంటర్ లాంటి వ్యక్తికి పీఏగా పనిచేస్తున్న నవీన్ కు సీబీఐ నోటీసులు జారీ చేయడం సంచలనం సృష్టిస్తోంది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారించిన సీబీఐ, అతడి ఫోన్ నుంచి నవీన్ అనే వ్యక్తి ఫోన్ కు చాలా కాల్స్ వెళ్లినట్టు గుర్తించింది. దాంతో నవీన్ ను కూడా విచారణకు రావాలంటూ సీబీఐ నోటీసులు పంపింది. దీనిపై వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. వైఎస్ జగన్ ఇంట్లో నవీన్ 15 ఏళ్లుగా పనిచేస్తున్నాడని వెల్లడించారు. వైఎస్ భారతితో మాట్లాడాలంటే తాను కూడా నవీన్ నెంబర్ కి  ఫోన్ చేస్తానని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
More Telugu News