షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్

  • సన్నీ కుడికాలి బొటన వేలుకు గాయం
  • వేలి గాయం నుంచి రక్తస్రావం 
  • కింది పెదవి కూడా చితికిన వైనం
Sunny Leone injured in shooting

బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ కు దక్షిణాదిలో కూడా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదారు చిత్రాలు ఉన్నాయి. మరోవైపు ఓ సినిమా షూటింగ్ లో సన్నీ గాయపడింది. కుడికాలి బొటన వేలుకు గాయమయింది. వేలి నుంచి రక్తం కారింది. ఆమె కింది పెదవి కూడా కొద్దిగా చితికింది. నొప్పిని భరించలేక సన్నీ విలవిల్లాడింది. సెట్స్ లో ఉన్న సిబ్బంది ఆమెకు ఫస్ట్ ఎయిడ్ చేశారు. నెమ్మదిగా క్లీన్ చేయండి అంటూ వారికి ఆమె చెప్పింది. ఇంజెక్షన్ వేయవద్దని వారిని వారించింది. అయితే ఈ సందర్భంగా సన్నీలియోన్ వేసుకున్న కాస్ట్యూమ్స్ చూస్తుంటే ఆమె డీగ్లామర్ పాత్రను పోషిస్తోందనే విషయం అర్థమవుతోంది.  
.

More Telugu News