అమరావతే రాజధాని అని, అక్కడే ఇల్లు కట్టుకున్నానని సీఎం కాకముందు జగన్ చెప్పలేదా?: సోము వీర్రాజు

  • ఏపీ రాజధాని విశాఖ అంటూ సీఎం జగన్ వెల్లడి
  • తాను కూడా విశాఖ షిఫ్ట్ అవుతున్నట్టు వివరణ
  • జగన్ మాట మార్చుతున్నారన్న సోము వీర్రాజు
  • ఏపీకి అమరావతే రాజధాని అని ఉద్ఘాటన
Somu Veerraju slams CM Jagan on AP Capital issue

ఏపీకి విశాఖ రాజధాని అవుతోందని, తాను కూడా త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతున్నానని సీఎం జగన్ ఇవాళ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం అయ్యాక జగన్ మాటమార్చుతున్నారని మండిపడ్డారు. అమరావతిలోనే  రాజధాని ఉంటుందని, తాను కూడా అమరావతిలో ఇల్లు కట్టుకున్నానని సీఎం కాకముందు జగన్ చెప్పలేదా? అని నిలదీశారు. 

అమరావతి రాజధాని కోసం కేంద్రం రూ.2,500 కోట్లు ఇచ్చిందని, విశాఖ రాజధాని అన్న సీఎం జగన్ రూ.500 కోట్లయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఏపీకి అమరావతే రాజధానిగా ఉండాలని, బీజేపీ రాష్ట్ర నాయకత్వం వైఖరి అదేనని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

More Telugu News