పాకీజా ఆర్ధిక పరిస్థితి నన్ను కదిలించివేసింది: నాగబాబు

  • ఇటీవల సుమన్ టీవీలో వచ్చిన పాకీజా ఇంటర్వ్యూ 
  • తన ఆర్థికపరిస్థితి బాగో లేదంటూ కన్నీళ్లు 
  • లక్షరూపాయల సాయాన్ని అందించిన నాగబాబు
  • ఆమెకి అవకాశాలు కల్పించమని ఇండస్ట్రీకి విజ్ఞప్తి  
Nagababu Interview

వాసుకి అనే పేరు వింటే ఎవరామె అని అడుగుతారు. 'పాకీజా' అంటే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు. 'అసెంబ్లీ రౌడీ' సినిమాలోని ఆ పాత్ర ఆమెకి అంతటి గుర్తింపును తీసుకొచ్చింది. ఇటీవల ఆమె ఇంటర్వ్యూ 'సుమన్ టీవీ'లో వచ్చింది. తాను చాలా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నట్టుగా చెబుతూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. 

ఆ ఎపిసోడ్ చూసిన వెంటనే ఆమెకి నాగబాబు లక్షరూపాయల చెక్ పంపించారు. అయితే ఆ విషయాన్ని బయటికి చెప్పలేదు. తాజాగా నాగబాబును ఇంటర్వ్యూ చేస్తూ సుమన్ టీవీ ప్రతినిధి  రోహన్ ఆ విషయాన్ని రివీల్ చేశాడు. వాసుకి ఆర్ధిక పరిస్థితి తనని కదిలించి వేసిందనీ, అందుకే తనకి తోచిన సాయాన్ని అందించానని నాగబాబు చెప్పారు. 

వాసుకి మంచి ఆర్టిస్ట్ అనీ .. అందువలన తెలుగు సినిమాలకి సంబంధించినవారుగానీ .. టీవీ సీరియల్స్ కి సంబంధించినవారుగాని ఆమెకి అవకాశాలు ఇస్తే హెల్ప్ చేసినట్టుగా ఉంటుందని నాగబాబు అన్నారు. ఆశాభావంతో అవకాశాల కోసం ఆమె ఎదురుచూస్తే అంతా మంచే జరుగుతుందని చెప్పుకొచ్చారు.

More Telugu News