అతనికి భయమంటే ఏమిటో తెలియదు .. 'వేద' తెలుగు ట్రైలర్ రిలీజ్!

  • 'వేద'గా శివరాజ్ కుమార్
  • గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ 
  • కన్నడలో హిట్ కొట్టిన మూవీ
  • తెలుగులో వచ్చేనెల 9న విడుదలవుతున్న సినిమా
Veda telugu trailer released

ఒకప్పుడు తెలుగులో తమిళ సినిమాల అనువాదాలకి మాత్రమే డిమాండ్ ఉండేది. ఈ మధ్య కాలంలో మలయాళ రీమేకులకు .. కన్నడ అనువాదాలకు డిమాండ్ పెరుగుతూ వెళుతోంది. కన్నడ నుంచి ఇటీవల ఇక్కడికి వచ్చిన 'కాంతార' ఏ స్థాయిలో వసూళ్లను రాబట్టిందనేది తెలిసిందే. అలా త్వరలోనే ఇక్కడి ప్రేక్షకుల ముందుకు 'వేద' రానుంది. 

శివరాజ్ కుమార్ కన్నడలో చేసిన 'వేద' క్రితం ఏడాది డిసెంబర్ లో విడుదలై అక్కడ భారీ విజయాన్ని సాధించింది. శివరాజ్ కుమార్ నిర్మాతగాను వ్యవహరించిన ఈ సినిమాకి హర్ష దర్శకత్వం వహించాడు. అర్జున్ జన్య సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, అదే టైటిల్ తో ఫిబ్రవరి 9వ తేదీన తెలుగులో విడుదలవుతోంది. 

ఈ సినిమాకి సంబంధించిన తెలుగు ట్రైలర్ ను కొంతసేపటి క్రితం విడుదల చేశారు. 'వేద .. అతనికి భయం అంటే ఏమిటో తెలియదు .. క్షమించడం అంటే ఏమిటో కూడా తెలియదు' అంటూ హీరో పాత్రను పరిచయం చేశారు. అతను .. భార్య .. కూతురు కలిసి చేసిన పోరాటంగా ఈ కథ కనిపిస్తోంది. వారి పోరాటం ఎవరి కోసం? దేని కోసం? అనేది సస్పెన్స్. తెలుగులో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందనేది చూడాలి.

More Telugu News