అందాల మందారం .. ఆషిక రంగనాథ్: లేటెస్ట్ పిక్స్!

  • 2016లోనే కెరియర్ ను మొదలెట్టిన ఆషిక 
  • వరుస కన్నడ సినిమాలతో బిజీ 
  • 'అమిగోస్' ద్వారా టాలీవుడ్ కి పరిచయం 
  • త్వరలోనే ఇక్కడ దూసుకెళ్లే ఛాన్స్   
Ashika Ranganath Special

తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో కన్నడ బ్యూటీలు ఎక్కువగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే రష్మిక టాప్ త్రీ హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరో సుందరి 'అమిగోస్' సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమవుతోంది. ఆ బ్యూటీ పేరే 'ఆషిక రంగనాథ్.గతంలో కల్యాణ్ రామ్ జోడీగా చాలామంది కొత్త హీరోయిన్లు పరిచయమయ్యారు. వాళ్లందరి కంటే అందంగా .. ఆకర్షణీయంగా కనిపించడం ఆషిక ప్రత్యేకత. చక్కని కనుముక్కుతీరుతో ఉన్న ఈ ముద్దుగుమ్మను తెరపై చూడటానికి కుర్రాళ్లంతా ఆసక్తిని చూపుతున్నారు.2016లోనే కన్నడ సినిమాలతో తన కెరియర్ ను మొదలెట్టిన ఆషిక, అక్కడ వరుస సినిమాలను చేస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ కి పరిచయమవుతోంది. ఇక్కడి హీరోల సరసన సందడి చేసే గ్లామర్ పుష్కలంగా ఉన్న ఈ సుందరి, త్వరలో ఇక్కడ చక్రం తిప్పే అవకాశాలు లేకపోలేదు.

More Telugu News